ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల
🍥బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఎడ్‌సెట్ ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనునున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలను రెండు రోజులపాటు, నాలుగు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి శుక్రవారం టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.450, ఇతరులు రూ.650 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తివివరాల కోసం https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్. శ్రీనివాస్‌రావు, ఎడ్‌సెట్ కన్వీనర్ అవ్వారు రామకృష్ణ, కో- కన్వీనర్ డాక్టర్ పారుపల్లి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
💥ప్రశ్నల కూర్పు ఇలా ..
👉ప్రవేశ పరీక్షలో మెథడ్స్‌ను రద్దుచేసి అందరికీ కామన్ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశ్నల కూర్పుపై అధికారులు స్పష్టతనిచ్చారు. మొత్తం 150 మార్కుల ప్రశ్నలను 120 నిమిషాల్లో రాయాల్సి ఉంటుందని తెలిపారు. సిలబస్‌ను భారీగా తగ్గించగా, 1-10 తరగతుల వరకు అన్ని సబ్జెక్ట్‌లకు 60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు 20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 20 మార్కులు, జనరల్‌నాలెడ్జ్, విద్యాసంబంధ అంశాలకు 30, కంప్యూటర్ ఆవేర్‌నెస్‌కు 20 మార్కులకు పరీక్షను నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష తర్వాత మెథడాలజీ వారీగా విద్యార్థులకు ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తామని ఎడ్‌సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.
💥ముఖ్యమైన తేదీలు
♦️ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 19-4-2021
♦️దరఖాస్తులకు గడువు : 15-6-2021
♦️రూ.250 అపరాధ రుసుముతో : 25-6 -2021
♦️రూ. 500 అపరాధ రుసుముతో : 05-7-2021
♦️రూ. 1000 అపరాధ రుసుముతో : 20 -7 -2021
💥ప్రవేశ పరీక్షలు :
💠ఆగస్టు 24,25 తేదీల్లో ఉదయం 10 – 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లు.