Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

Centaral govt approval for new zones

 🌳కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం


♦️గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన హోంశాఖ


♦️కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం




🔷ఈనాడు:ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిసుందని తెలిపింది.


♦️అన్ని జిల్లాలకు సమానావకాశాలు!  కొత్త జోన్లతో విస్తృత ప్రయోజనాలు



🔷ఈనాడు: కొత్త జోనల్‌ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కావడంతో పాటు విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రధానంగా విద్యా ఉద్యోగావకాశాల్లో అసమానతలను తొలగిపోయి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానావకాశాలు దక్కనున్నాయి. అలాగే స్థానిక రిజర్వేషన్లు కూడా పక్కాగా అమలుకానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జోన్ల విధానం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందనే భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జోనల్‌ విధానం రూపకల్పనపై దృష్టి సారించారు. నగరాలు, పట్టణాలు, ఇతర రకాలుగా పురోగమించిన జిల్లాలకే కాకుండా మారుమూల, ఏజెన్సీ, ఇతరత్రా వెనకబడిన జిల్లాలకు అన్ని విధాలా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త జోనల్‌ విధానాన్ని ఖరారు చేశారు. తొలుత 31 జిల్లాలకు జోనల్‌ విధానాన్ని రూపొందించారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేటలను సైతం కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్‌ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి మోక్షం కలిగింది.

ఉద్యోగ నియామకాలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జోనల్‌ విధానంతో ఉద్యోగ నియామకాలు జరగలేదు. విద్యాపరంగా సైతం ఇంజినీరింగ్‌, వైద్య విద్య ప్రవేశాల్లో రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే వీటిని చేపడుతున్నారు. దీంతో సమానత్వం సాధ్యం కావడం లేదు. కొత్త జోనల్‌ విధానం ఆమోదం పొందడంతో కొత్త ఉద్యోగ నియామకాలు దీని కిందనే జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించింది. కొత్త జోనల్‌్ విధానం వచ్చాక వాటిని చేపట్టాలనే భావనతో ఉంది. కొత్త విధానంతో నియామకాలు చేపడితే హైదరాబాద్‌, రంగారెడ్డి తదితర జిల్లాల మాదిరే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ములుగు, భూపాలపల్లి సహా అన్ని జిల్లాల్లోని వారికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విద్యాపరంగానూ అన్ని జిల్లాలకు ప్రవేశాలు దక్కుతాయి.  

ఉద్యోగుల సమస్యల పరిష్కారం

ఇకమీదట జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు కానుంది. దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి జోనల్‌ కేటాయింపులు సులభం కానున్నాయి.👇👇👇

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.