MLC ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఏమిటో తెలుసుకోండి
ప్రస్తుతం జరగనున్న నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రులఎమ్మెల్సీ నియోజకవర్గంలోని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయండి
ఎమ్మెల్సీ ఎన్నిక :
పట్టభద్రులు అంటే డిగ్రీ పూర్తి చేసుకున్న వారు, డిగ్రీ పూర్తి చేసుకుని 3సంవత్సరాల యుండాలి. అలాంటి పట్టభద్రులే ఓటుహక్కుకు అర్హులు, ఉద్యోగం చేస్తున్నవారు, నిరుద్యోగులు కూడా ఓటు వేయవచ్చు.
సాధారణంగా ఎన్నికలలో మనం మనకు నచ్చిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తాం, కేవలం ఆ అభ్యర్థి ఒక్కరికే కాకుండా మరొకరికి కూడా ఓటు వేస్తే చెల్లు బాటు కాకుండా పోతోంది అక్కడ కాని ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం ఓటు వేసే ప్రక్రియ మాత్రం భిన్నంగా ఉంటుంది.
ఇక్కడ మనం మనకు కావలసిన అభ్యర్ధి కి మాత్రమే కాకుండా మరొకరికి కూడా ఇంకో ఓటు వేయవచ్చు. పోటీలో ఎంతమంది ఉంటే అంత మందికి ఓటు వేయ వచ్చు. ఇ లాంటి విధానం లో మన ఓటు ఎవరి కీ ఎలా వేసుకో వాలి.. ? మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటే.. ? ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం.
ఈ MLC ఎన్నికలవిధానం గురించి తెలు సుండాలీ.
ఇపుడు ఈ ఎన్ని కల ప్రచారం లో అభ్యర్థుల కర పత్రాలలో చూసే ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని ప్రతి అభ్యర్ధి కోరడం గమనించే ఉంటారు. (1)_మొదటి ప్రాధాన్యత ఓ టు అంటే, మనకు నచ్చిన అభ్యర్థికి మొదట ఓటు వేయడం....... ఇంకో అభ్యర్థికి 2 (నెంబరు/number) ఓటు వేయవచ్చు. ఇంకో అభ్యర్థికి కి 3 (నెంబరు) ప్రాధాన్యత ఓటు వేయవచ్చు అన్నమాట. ఓ 20 మందీ బరిలో ఉంటే, వరుసగా ... వారి పేర్లు ఉండగా, మనకు నచ్చిన అభ్యర్ధి వరుసలో పేరు పక్కన / బ్యాలెట్ పేపర్ లో నిర్దేశించబడిన స్థలంలో ఓటు వేయవచ్చు..... 20 మంది 30 మంది అభ్యర్థులు ఉన్నాసరే, ఉదాహరణకు వరుసలో నెంబర్ 12 లో ఉంటే అక్కడ నెంబర్ 1 వేస్తేఅది మొదటి ప్రాధాన్యత ఓటు అన్నమాట. ఇలా వరుసగా 30 మందికి కూడా ఓటు వేయవచ్చు..... 50 శాతం ఓట్లు ఎవరికి వస్తే గెలిచి నట్లు లెక్క. మొదటి "1"ప్రాధాన్యత ఓట్లు 50% రాకపోతే చివరి వ్యక్తి కిపడ్డ "2" ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు . అక్కడ 50 శాతం రాకపోతే మళ్లీ చివరి నుండి రెండవ వ్యక్తి కి పడ్డ 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు, ఇలా 50 శాతం ఓట్లు వచ్చేవరకు లెక్కిస్తారు,50 శాతం ఓట్లు వచ్చిన వారినే గెలిచినట్లుగా ప్రకటిస్తారు . ఓట్ల లెక్కంపులో ఈ ప్రాధాన్యత ముఖ్య పాత్ర వహిస్తుంది