Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

తెలంగాణ జాతరలు

 తెలంగాణ జాతరలు



1) నాగోబాను ఎప్పుడు జరుపుకుంటారు?

జ: మాఘ శుద్ద పౌర్ణమి ( మూడురోజులు)

2) ఏయే రాష్ట్రాల నుంచి ప్రజలు నాగోబా జాతరకు హాజరవుతారు?

జ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్

3) ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది ?

జ: సమ్మక్క సారక్క జాతర

4) తెలంగాణ కుంభమేళా అని దేనిని పిలుస్తారు?

జ: సమ్మక్క సారక్క జాతర



5) సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది?

జ: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో

6) సమ్మక్క సారక్క జాతర ఎన్నేళ్ళ కోసారి జరుగుతుంది?

జ: రెండేళ్ళకు

7) మేడారం జాతర ఎన్ని రోజులపాటు జరుగుతుంది?

జ: నాలుగు రోజులు

8) అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తారు?

జ: బంగారం(బెల్లం)

9) ఈ పండుగను రాష్ట్ర పండుగగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది ?

జ: 1996లో



10) ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది?

జ: మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం నాగసానిపల్లిలో

11) నాగసాని పల్లిలో ఏ దేవాలయం నిర్మించారు?

జ) వన దుర్గా భవానీ దేవాలయం

12) ఏడుపాయల జాతర ఎన్ని రోజులు నిర్వహిస్తారు?

జ: మహాశివరాత్రికి మూడు రోజులు

13) గొల్లగట్టు జాతర ఎక్కడ జరుగుతుంది?

జ: నల్గొండ జిల్లాలోని సూర్యాపేట పాలశెర్లయ్య గట్టు(గొల్లగట్టు)

14) గొల్లగట్టు జాతరకు ఇంకొక పేరేంటి?

జ: పెద్దమ్మగట్టు జాతర

15) గొల్లగట్టు జాతర ఎన్నేళ్ళ కోసారి జరుగుతుంది?

జ: రెండేళ్ళకు. నాలుగు రోజుల పాటు

16) యాదవుల ఆరాధ్య దైవం ఎవరు?

జ: లింగమంతుల స్వామి (శివుడు), అతని సోదరి చౌడమ్మ తల్లి

17) గండాలు తొలగించాలని ఏమి వెలిగిస్తారు?

జ: గండదీపం

18) కొండగట్టు ఎక్కడ ఉన్నది?

జ: కరీంనగర్ జిల్లా ముత్యంపేట

19) కొండగట్లులో ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుంది ?

జ: ఒక వైపు ఆంజనేయుడు, మరోవైపు నరసింహ స్వామి ముఖాలు

20) కొమురవెల్లి మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది?

జ: వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో కొమురవెల్లి గ్రామంలో

21) కొమురవెల్లి మల్లన్నను ఏమని పిలుస్తారు?

జ: మీసాల మల్లన్న

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.