Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

తెలంగాణ పండుగలు...imp questions

 🌳తెలంగాణ పండుగలు -ముఖ్యమైనప్రశ్నలు🌳

1) తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏది?


జ: బతుకమ్మ పండుగ


🔷2) బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలవుతుంది?


జ: అశ్వయిజ శుక్ల పక్ష పాడ్యమి


🔷3) బతుకమ్మలో ఏ పువ్వును ఎక్కువగా వాడతారు?


జ: గునుగు పువ్వు


🔷4) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?


జ: 2014 జూన్ 16


🔷5) రోజు            బతుకమ్మ                నైవేద్యం


మొదటిరోజు - ఎంగిలిపూలు - నువ్వులు,నూకలు


రెండోరోజు - అటుకుల - ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు


మూడో రోజు - ముద్దపప్పు - తడిబియ్యం, పాలు, బెల్లం


నాలుగోరోజు - నానబియ్యం - తడి బియ్యం, పాలు, బెల్లం


ఐదోరోజు - అట్ల బతుకమ్మ - అట్లు


ఆరో రోజు - అలిగిన బతుకమ్మ - అట్లు


ఏడోరోజు - వేపకాయల బతుకమ్మ - వేపకాయల ఆకారంలో బియ్యపుపిండి


ఎనిమిదో రోజు - వెన్నముద్దల -నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం



తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, కొబ్బరన్నం, పులి హోర, నువ్వుల అన్నం



🔷బోనం అంటే ఏమిటి?


జ: భోజనం లేదా నైవేద్యం


🔷బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?


జ: 2014 జూన్ 16


🔷మహిళలు మట్టి కుండల్లో ఏ ఆహార పదార్దాలను అమ్మవారికి బోనంగా సమర్పిస్తారు?


జ: అన్నం,పాలు, బెల్లంతో కూడిన బోనం


🔷తెలంగాణలో పెళ్ళికాని ఆడ పిల్లలు జరుపుకునే పండుగ ఏది?


జ: బొడ్డెమ్మ పండుగ


 🔷వినాయకచవితి లేదా భాద్రపద బహుళ పంచమి నుంచి మహాలయ అమావాస్య వరకు జరుపుకునే పండుగ ఏది ?


జ: బొడ్డెమ్మ


🔷తొమ్మిదో రోజు ఏది నైవేద్యంగా పెడతారు?


జ: కలశంలో పోసిన బియ్యంతో పాయసం


🔷దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి?


జ: అశ్వయిజ మాసం


🔷దసరాని ఎన్ని రోజులు జరుపుకుంటారు?


జ: తొమ్మిది రోజులు


🔷పదో రోజును ఏమని పిలుస్తారు?


జ: విజయ దశమి లేదా దసరా


🔷దసరా పండుగ నాడు ఏ చెట్టును పూజిస్తారు?


జ: జమ్మిచెట్టు


🔷దసరా నాడు వరంగల్ భద్రకాళి దేవాలయం ఏ ఉత్సవం నిర్వహిస్తారు?


జ: తెప్సోత్సవం


🔷దసరా నాడు ఏ పూజ ,చేస్తారు?


జ: ఆయుధ పూజ


🔷దీపావళి పండుగను ఏ రోజు జరుపుకుంటారు?


జ: కార్తీక అమావాస్య


🔷దీపావళికి ఏ అమ్మవారిని పూజిస్తారు?


జ: లక్ష్మి దేవి


🔷మొహరం నెల యొక్క పదో రోజు ఏమిటి?


జ: అఘరాదినం


🔷మొహరం ఎవరికి నివాళులు అర్పిస్తూ జరుపుకుంటారు?


జ: ఇమామ్ హుస్సేన్


 🔷మొహరం నాడు ఊరేగింపు ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది?


జ: బీబీ కా ఆలం నుంచి చాదర్ ఘాట్


🔷తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు?


జ: బంజారా యువతులు




🔷సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారు? అవి ఏవి?


జ. మూడు రోజులు


మొదటి రోజు భోగి


రెండవ రోజు సంక్రాంతి


మూడవ రోజు కనుమ


🔷బొమ్మల కొలువు ఏ రోజు పెడతారు? పాతవస్తువులను ఏ రోజు కాలుస్తారు?


జ. భోగి రోజు బొమ్మల కొలువు పెడతారు (పాతవస్తువులను భోగినాడు కాలుస్తారు)


 🔷హోళీ పండుగను ఏయే పేర్లతో పిలుస్తారు?


జ. వసంత పంచమి "డోల్ పూర్ణిమ"


🔷పోలాల అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు?


జ. శ్రావణమాసం చివరన భాధ్రపద నెల మొదట్లో జరుపుకుంటారు


🔷మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది?


జ. ఫిబ్రవరి, మార్చి నెలలో


 🔷హనుమన్ జయంతి ఎప్పుడు వస్తుంది? ఇష్టమైన దండ ఏమిటి?


జ. ఛైత్రశుధ్ద పౌర్ణమి, తమలపాకుల దండ


 🔷కృష్ణాష్టమికి గల ఇతర పేర్లు ఏమిటి?


జ. అష్టమి రోహిణి లేదా ఉట్ల పండుగ లేదా గోకులాష్టమి.


🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.