రైల్వేశాఖలో ఉద్యోగాలు.. వచ్చే నెల 23 వరకు దరఖాస్తు గడువు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ పరిధిలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. కంపెనీలో ఖాళీగా ఉన్న 1074 పోస్టుల భర్తీకి గతనెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు అప్లయ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అప్లికేషన్ గడువును వచ్చే నెల 23 వరుకు పొడిగించారు. రాత పరీక్షను సెప్టెంటర్ లేదా అక్టోబర్ నెలకు వాయిదావేసే అవకాశం ఉన్నది. ఈ పోస్టులు సివిల్, ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, ఆపరేషన్స్ అండ్ బీడీ, మెకానికల్ డిపార్ట్‌మెంట్లలో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 1074
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 442, జూనియర్ ఎగ్జిక్యూటివ్ 519, జూనియర్ మేనేజర్ 111 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో. అర్హత కలిగినవారిని ఆన్‌లైన్ రాతపరీక్షకు పిలుస్తారు.
అప్లికేషన్ ఫీజు: ఎగ్జిక్యూటివ్‌కు రూ.900, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.700, జూనియర్ మేనేజర్‌కు రూ.1000
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 23
రాతపరీక్ష: సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో