Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది

 సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది

💥📝సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

🔥సీటెట్‌ అప్లికేషన్లు ప్రారంభం..🔥 సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) డిసెంబర్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయ అర్మత పరీక్షను ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు సీబీఎస్సీ ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలో 60 శాతం మార్కులు సాధించినవారిని అర్హులుగా పరిగణిస్తారు.


అర్హత: బీఈడీ, డీఈడీ చేసి ఉండాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.

రాతపరీక్ష: డిసెంబర్‌ 16 నుంచి జనవరి 13 వరకు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు


పరీక్ష విధానం

రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మొదటి పేపర్‌, ఆరు నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2 ఉంటుంది.

పేపర్‌-1: పరీక్ష మొత్తం 150 మార్కులు. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాగి, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్ ‌30 నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

పేపర్‌-2: మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాగి, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్ అండ్‌ సైన్స్‌‌ లేదా సోషల్‌ స్టడీస్‌/సోషల్‌ సైన్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొదటి మూడు సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు. మిగిలిన రెండు సెక్షన్లకు 60 మార్కుల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, రెండు పేపర్లు అయితే రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500, రెండు పేపర్లు అయితే రూ.600

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 20

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 19

ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్‌ 20

Click link Apply now

https://ctet.nic.in

 విద్య ఉద్యోగ సమాచారం కోసం

Allgovt jobs telegram group 
Join Now 

Click here:https://t.me/tsAllgovtjobs 

ఎనిమిది కేంద్రాల్లో సీటెట్‌

▪️సెంట్రల్‌ టీచర్‌ ఎలిజబులిటీ టెస్ట్‌ (సీటెట్‌) రాతపరీక్షను రాష్ట్రంలో ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. ఈ మేరకు సీటెట్‌ డైరెక్టర్‌ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, వరంగల్‌ పట్టణాల్లో నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. 


  

సీటెట్‌.. సరికొత్తగా

   🔷జ్ఞాపకశక్తిని కాదు.. జ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నపత్రం

  🔶జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు
  🔷వచ్చే డిసెంబరు / జనవరిలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష


 జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌) ప్రశ్నపత్ర స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య అందాలంటే బోధన వృత్తిపై ఆసక్తి ఉన్నవారే ఉపాధ్యాయులుగా మారాలని, వారు ప్రతిభావంతులై ఉండాలని.. ఈ మేరకు ఎంపిక విధానంలో మార్పులు చేస్తామని జాతీయ విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో వచ్చే డిసెంబరు లేదా జనవరిలో నిర్వహించనున్న సీటెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో జరపాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. అంతేకాకుండా జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రశ్నలను తగ్గించి ఆయా భావనలపై అవగాహన, సమస్యలను పరిష్కరించే నేర్పు, రీజనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌లపై ప్రశ్నలు ఎక్కువగా ఇస్తామని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ప్రధానంగా సబ్జెక్టుపై అవగాహన, బోధించే విధానాలపై పరిజ్ఞానాన్ని పరిశీలించడం, ఆయా బోధన ఉపకరణాల వినియోగంపై పట్టు తదితర అంశాలపై దృష్టి పెట్టి అభ్యర్థిని అంచనా వేస్తామని తెలిపింది. దీనిపై త్వరలో బ్లూ ప్రింట్‌తోపాటు మాదిరి ప్రశ్నలను విడుదల చేయనుంది.

   జిల్లాల్లో నమూనా పరీక్షలు

  ఆన్‌లైన్‌ విధానంలో తొలిసారిగా పరీక్ష జరపనున్నారు. అందుకు ఉచితంగా ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వాటి నిర్వహణకు జిల్లాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు నెలకొల్పుతారు. దేశవ్యాప్తంగా సీటెట్‌ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుండగా.. ఒక్కోసారి దాదాపు 28 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. నవోదయ, ఆర్మీ విద్యాలయాలు ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సీటెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్రంలో జరిగే ఉపాధ్యాయ నియామకాలకూ దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
Ctet 2021


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.